ఆకట్టుకున్న కవలల పెళ్లిళ్లు

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి ఏరియా కు చెందిన కవల సోదరులు తరుణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలం టింబుర్ని గ్రామానికి చెందిన కవల సోదరీమణులు స్పందన స్ఫూర్తిలతో వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

ఆకట్టుకున్న కవలల పెళ్లిళ్లు
X

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి ఏరియా కు చెందిన కవల సోదరులు తరుణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలం టింబుర్ని గ్రామానికి చెందిన కవల సోదరీమణులు స్పందన స్ఫూర్తిలతో వివాహం అత్యంత వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షనల్ వేదిక పైన జరిగిన ఈ అరుదైన ఇద్దరు కవలలైన అన్నదమ్ముల.. ఇద్దరు కవలలైన సోదరీమణుల వివాహం అందరినీ ఆకట్టుకుంది. ఒకే వేదికపై ఇద్దరు కవల జంటలకు పెండ్లి చేసిన ఇద్దరిని చూస్తే ఒకే జంట పెళ్లి ఫోటోలను రెండు రకాలుగా తీసి అతికించినట్లు రెండు జంటలు కనబడుతున్నాయని అనుకుంటున్నట్లు ఈ జంటలు ఉన్నాయి కానీ ఇవి అరుదైన క్వాడ్రఫుల్ వెడ్డింగ్ (కవల జంటల) అంటే ఇద్దరు కవల సోదరులు కవల సోదరీమణులు ఒకే ఫంక్షన్ హాల్ వేదికపై వివాహం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కవలల క్వాడ్రఫుల్ వెడ్డింగ్ అందరినీ ముచ్చట గొలిపింది.

Next Story