విగ్ నచ్చకపోతే చెప్పాలి చంపేస్తారా? కొడుకు హత్యపై కేతన్ తండ్రి ఎమోషనల్

by Ajay Maddhiboyina |

మహారాష్ట్రంలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్యపై అతడి తండ్రి స్పందించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సియా గోయల్‌కు కేతన్ విగ్ నచ్చలేదంట అందుకే పెళ్లి ఇష్టంలేక చంపేసిందని అంటున్నారు దానికి మీరు ఏం అంటారు అని రిపోర్టర్ ప్రశ్నించారు.

విగ్ నచ్చకపోతే చెప్పాలి చంపేస్తారా?  కొడుకు హత్యపై కేతన్ తండ్రి ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రంలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్యపై అతడి తండ్రి స్పందించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సియా గోయల్‌కు కేతన్ విగ్ నచ్చలేదంట అందుకే పెళ్లి ఇష్టంలేక చంపేసిందని అంటున్నారు దానికి మీరు ఏం అంటారు అని రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి కేతన్ తండ్రి.. విగ్ నచ్చకపోతే చెప్పాలి కానీ చంపేస్తారా అని ప్రశ్నించారు. ఒకరి బిడ్డను చంపేయడానికి ఇది ఒక కారణమా అని ఆవేదన వ్యక్తం చేశారు. నచ్చకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. కేతన్ ఒక చిన్న హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటాడని అది పెళ్లి ఫిక్స్ చేయకముందే సియాకు తెలుసని చెప్పారు.

ఆమెకు ముందుగానే అన్నీ చెప్పామని, అన్ని తెలుసు అని తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అతి తొందరలో బయటపడతాయని పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు. ఇదిలా ఉంటే పూణేకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కేత‌న్ అగ‌ర్వాల్ తో జూన్ 18 సియా గోయ‌ల్ తో నిశ్చితార్థం జ‌రిగింది. అప్ప‌టికే సియాకు ప్రియుడు ఉండ‌టంతో బ‌ర్త్ డే పార్టీ పేరుతో కేత‌న్ ను లోహ్ ఘ‌డ్ కోట వ‌ద్ద‌కు తీసుకువెళ్లి కొండ‌పై నుండి తోసేసింది. ఇప్ప‌టికే సియా గోయ‌ల్ ఆమె ప్రియుడు చేత‌న్ చౌద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి క‌ఠిన శిక్ష విధించాల‌ని కేత‌న్ త‌ల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Next Story