- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు ఒకరు మృతి.. మరొకరికి గాయాలు..
by Taduka Kalyani |
పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందగా పక్కనే ఉన్న మరో బాలునికి గాయాలైన ఘటన మండలంలోని వెంకటపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, సదాశివపేట : పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందగా పక్కనే ఉన్న మరో బాలునికి గాయాలైన ఘటన మండలంలోని వెంకటపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చింతకింది అనిల్ (25) వరుసకు తన అల్లుడైన సిద్ధార్థ (5) తో కలిసి శుక్రవారం ఉదయం పశువులను మేపేందుకు పొలం వద్దకు వెళ్ళారు. అయితే మధ్యాహ్నం ఒక్క సారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతలోనే భారీ శబ్దంతో అనిల్ పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందగా పక్కనే ఉన్న సిద్ధార్థ్ కు గాయమైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాలుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిద్ధార్థ్ ను ఆసుపత్రికి తరలించారు.
Next Story






