పీసీసీఎఫ్ సువర్ణ పదవీ విరమణ.. వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-26 09:30:44  IST  )

తెలంగాణ అటవీ దళాల అధిపతి (PCCF) సి.సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

పీసీసీఎఫ్ సువర్ణ పదవీ విరమణ.. వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) డాక్టర్ సి.సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమెను సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆమె స్థానంలో1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్), చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (CWLW)గా బాధ్యతలు నిర్వహిస్తున్న వినయ్ కుమార్‌కు పీసీసీఎఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Next Story