కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా అలా చేయాలి.. అదే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది: త్రిప్తి డిమ్రి

by Mallepaka Hamsa |

ఒక నటిగా నేను చేసే ఒక్కో క్యారెక్టర్ ద్వారా ఒక్కో కొత్త జీవితాన్ని జీవించే అవకాశం నాకు దొరుకుతుంది.

కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా అలా చేయాలి.. అదే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది:  త్రిప్తి డిమ్రి
X

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన త్రిప్తి ఇప్పటికీ అదే క్రేజ్‌‌తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం త్రిప్తి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి.. సినిమా ఇండస్ట్రీలో ఒక నటిగా ఉండటంలో ఉండే లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. "ఒక నటిగా నేను చేసే ఒక్కో క్యారెక్టర్ ద్వారా ఒక్కో కొత్త జీవితాన్ని జీవించే అవకాశం నాకు దొరుకుతుంది. నిజ జీవితంలో మనం చేయలేని ఎన్నో విషయాలను, ఎమోషన్స్‌ను కెమెరా ముందు పాత్రల ద్వారా అనుభవించవచ్చు.

ప్రతి కొత్త ప్రాజెక్ట్ మనకు లైఫ్‌లో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది" అని త్రిప్తి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కెరీర్‌లో ఎదురయ్యే ఫెయిల్యూర్స్ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయంపై త్రిప్తి స్పందిస్తూ.. "కచ్చితంగా కెరీర్‌లో చాలా కష్టమైన రోజులు వస్తాయి. మనం ఒకటి ఆశిస్తే ఇండస్ట్రీలో ఇంకొకటి జరుగుతుంది. అలాంటప్పుడు మన సామర్థ్యంపై మనకే అనుమానం రావడం చాలా కామన్. కానీ, ఆ కష్ట కాలమే మనకు ఓపికను, మనపై మనకు నమ్మకాన్ని నేర్పిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే.. నన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా మార్చడానికి ఆ ఫెయిల్యూర్స్ ఎంతగానో హెల్ప్ చేశాయి. అందుకే నేను అందరికీ ఒకటే చెప్తాను.. కష్టాలు వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా, తలదించుకుని మన పని మనం సిన్సియర్‌గా చేసుకుంటూ పోవాలి. అదే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది" అంటూ త్రిప్తి దిమ్రి క్లారిటీ ఇచ్చారు

Next Story