- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో యువత ముందుకు రావాలి: పోలీస్ కమిషనర్
డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

దిశ, వరంగల్ బ్యూరో: డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రపంచ మాదరద్రవ్యాల దుర్వినియోగం మరియు ఆక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకోని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును శుక్రవారం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్‌తో కలసి ప్రారంభించారు. ట్రై సిటి పరిధిలోని యువత విద్యార్థులు పాల్గోన్న ఈ పరుగు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు కోనసాగింది. మాదకద్రవ్యాల సంబంధించి ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారిందని, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, ఒక్కసారి వాటిని వినియోగించడం ద్వారా యువత జీవితాలు అంధకారం మారుతుందని పోలీసు కమిషనర్ అన్నారు.
ఇతరులకు అవగాహన కల్పించాలి...
మత్తు పదార్థాలను విక్రయాలు, వినియోగించడంలాంటి చర్యలకు పాల్పడి చిక్కుల్లో పడోద్దన్నారు. విద్యార్థులు కేవలం చదువులపైనే దృష్టి పెట్టాలని, అదే విధంగా యువత తమ ఉన్నంత లక్ష్య సాధనకై కృషి చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మాట్లాడుతూ యువత చేడు వ్యసనాలను దూరంగా వుంటూ ఆరోగ్యంతో వుండాలని, మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణకై ఈగల్ ఫోర్స్ విభాగాన్ని చేయడమైనదని, ఎవరైన మాదకద్రవ్యాలు విక్రయించిన, వినియోగించిన తక్షణమే 1908 నంబర్‌కు సమాచారం అందించాలని, వర్థన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు తెలిపారు.
సెల్ఫీ పాయింట్ ఫోటోలు దిగి...
హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్త్ వున్న యువత మత్తుకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసలయ్య వారి కుటుంబాలు, ముఖ్యంగా తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ పరుగులో పాల్గోన్న యువత, విద్యార్థుల మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సైనికుడిలా పనిచేస్తామని అంటు ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ఈ కార్యక్రమానికి హజరైన ముఖ్య అతిధిలు మాదకద్రవ్యాల నిర్మూలనకై “ఐయాం యాంటీ డ్రగ్స్ సోల్జర” సెల్ఫీ పాయింట్ ఫోటోలు దిగి యువతను స్పూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమములో టిజీ ఎన్‌పిడిసిఎల్ యం.డి వరుణ్ రెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు డా.సత్యశారద, చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రామిరెడ్డి, డిసిపిలు దార కవిత, అంకిత్‌కుమార్, అడిషినల్ కలెక్టర్ సంధ్యతో పాటు అడిషినల్ డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.






