రైతులకు నాణ్యమైన ఎరువులు అందివ్వాలి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

ఆకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ఫర్టిలైజర్‌ను ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు అందివ్వాలి: ఎమ్మెల్యే
X

దిశ, చిట్యాల: రైతులు నాణ్యమైన ఎరువులను వినియోగించి అధిక దిగుబడి సాధించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో గుమ్మడి సత్యనారాయణకు చెందిన నూతనంగా ఏర్పాటు చేసిన ఆకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఎరువులు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండటం వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రైతులు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం ఆకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మండల కేంద్రంలోని కేతిరి సరిత అశోక్, ముసుకే నిర్మల రాజబాబులకు చెందిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారి దంపతులకు శాలువలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గుమ్మడి శ్రీదేవి, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story