'చెన్నై లవ్ స్టోరీ' సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్న ఆ సంస్థ

by Pulgam srinivas |

'చెన్నై లవ్ స్టోరీ' సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను విజన్ సినిమాస్ సొంతం చేసుకుంది.

చెన్నై లవ్ స్టోరీ సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్న ఆ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ గౌరి ప్రియా హీరోయిన్‌గా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం థియేట్రికల్ బిజినెస్‌ను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను విజన్ సినిమాస్ దక్కించుకుంది.

సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రాన్ని ధీరజ్ సినిమాస్ విడుదల చేయనుంది. దీంతో ఆ ప్రాంతంలో సినిమాకు పెద్ద స్థాయిలో విడుదల లభించనున్నట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. రవి నంబూరి దర్శకత్వం వహించగా, ఎస్‌కేఎన్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.





Next Story