మల్లెపల్లి ‘ఫేమస్ ఫిష్ ఫ్రై’లో తింటున్నారా?.. టేస్ట్ వెనుక డేంజర్ రంగులు!

by Gantepaka Srikanth |

హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, ఫుడ్ జాయింట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మరోసారి వెలుగుచూశాయి. మల్లెపల్లి ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన "ఫేమస్ ఫిష్ ఫ్రై" (Famous Fish Fry) కేంద్రంలో హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం మెరుపు తనిఖీలు నిర్వహించింది.

మల్లెపల్లి ‘ఫేమస్ ఫిష్ ఫ్రై’లో తింటున్నారా?.. టేస్ట్ వెనుక డేంజర్ రంగులు!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, ఫుడ్ జాయింట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మరోసారి వెలుగుచూశాయి. మల్లెపల్లి ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన "ఫేమస్ ఫిష్ ఫ్రై" (Famous Fish Fry) కేంద్రంలో హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం మెరుపు తనిఖీలు నిర్వహించింది. హెచ్-ఫాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ డి. రమ్య నేతృత్వంలోని అధికారుల బృందం ఈ హోటల్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో సదరు సంస్థ కనీస నిబంధనలను పాటించడం లేదని తేలింది. ముఖ్యంగా, హోటల్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ, ఎలాంటి నూతనీకరణ (Renewal) లేకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనతో పాటు, వినియోగదారుల ఆరోగ్యంతో ఇక్కడ తీవ్రంగా ఆటలాడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. చేపల వేపుడు (ఫిష్ ఫ్రై) ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఆహార తయారీలో నిషేధిత, హానికరమైన కృత్రిమ రంగులను (Artificial Colours) విచ్చలవిడిగా వాడుతున్నట్లు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్.. హోటల్లోని పలు ఆహార పదార్థాల నమూనాలను (Food Samples) సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలను ఉల్లంఘించిన సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా రసాయనాలు, రంగులు వాడే హోటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్-ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు.

Next Story