- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ శాఖలో ‘మామూళ్ల డైరీ’ కలకలం.. కల్లు డిపోలు, వైన్స్‌ల వసూళ్ల చిట్టా వైరల్
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ‘వసూళ్ల డైరీ’ తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Telangana Excise Department)లో మామూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఓ రహస్య డైరీ (Secret Diary) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి ప్రతి నెల అందుతున్న అక్రమ వసూళ్ల లెక్కలు సదరు డైరీలో స్పష్టంగా ఉండటంతో ఇటు సంబంధిత శాఖలో.. అటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
డైరీలో రూ.2 లక్షల వరకు నెలవారీ వసూళ్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైరీ ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలోని కల్లు డిపోలు, వైన్స్ షాపుల యజమానుల నుంచి సదరు అధికారులు ప్రతి నెలా నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ చిట్టాలో లెక్కలు రాసి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎవరు ఎంత ఇచ్చారు.. ఏయే ప్రాంతాల నుంచి ఎంత పైకం వసూలు అయిందనే పూర్తి డేటా అదే డైరీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మల్లారెడ్డి ఏసీబీ అరెస్ట్ తర్వాతే బయటకు..
కాగా, ఇటీవలే నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి (Malla Reddy) నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసులో మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 3 కోట్లు, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 20 కోట్ల పైచిలుకు అక్రమాస్తులను మల్లారెడ్డి కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. ఆయన అరెస్ట్ అయిన కొద్ది రోజుల్లో ఈ వసూళ్ల డైరీ బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్‌లో పనిచేస్తున్న మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI)ను టార్గెట్ చేస్తూనే ఆ డైరీని కావాలనే బయటపెట్టారనే ప్రచారం కూడా జరగుతోంది.






