- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : విస్తరిస్తున్న నానో టెక్నాలజీ.. ఈ రంగాల్లో కీ రోల్..!
నానోఫిల్టర్లు & నానోపార్టికల్స్ ద్వారా నీటి నుండి కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగించవచ్చు.

దిశ, ఫీచర్స్ : ఏఐ తర్వాత నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. పైగా ఇది భవిష్యత్‌లో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోందని నిపుణులు అంటున్నారు. దీంతో ఈ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై పరిశోధనలు జరుగుతుండగా.. ఇప్పటికే పలు సెక్టార్టలలో, వర్క్‌ఫోర్స్‌లలో దీనిని ఉపయోగిస్తున్నారు. మందుల తయారీ నుంచి శక్తి పునరుద్ధరణ వరకు ఇది కీలకపాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఏయే రంగాల్లో విస్తరించే చాన్స్ ఉంది? నిపుణుల ప్రకారం భవిష్యత్‌లో ఎలా ఉపయోగపడునుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి నానోటెక్నాలజీ అంటే..1 నుండి 100 నానోమీటర్ల మధ్య సైజులో అటమ్స్ & మాలిక్యూల్స్ స్థాయిలో పదార్థాలను మానిప్యులేట్ చేసే సైన్స్ & టెక్నాలజీగా నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ ఒక్క నానోమీటర్ అంటే.. మానవ వెంట్రుక సైజ్ వెడల్పులో సుమారు 80,000 నుండి 1,00,000 భాగాలలో ఒక భాగం మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే టైనీ రోబోట్ల కంటే, నిజమైన నానో పార్టికల్స్, నానోమెటీరియల్స్‌తో పనిచేస్తుంది. నానో స్కేల్‌లో క్వాంటమ్ ఎఫెక్ట్స్ కారణంగా మెటీరియల్స్ బలంగా, తేలికగా, మరింత విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. దీని వల్ల మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, పర్యావరణం వంటి రంగాల్లో గేమ్ చేంజర్‌గా మారుతోంది.
*వైద్య రంగం : వైద్య రంగంలో నానోటెక్నాలజీ ఇప్పటికే సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీలో కీ రోల్ పోషిస్తోంది. నానోపార్టికల్స్ ద్వారా మందులు నేరుగా క్యాన్సర్ కణాలు లేదా వ్యాధి ఉన్న ప్రాంతానికి చేరి, సైడ్ ఎఫెక్ట్స్‌ను భారీగా తగ్గిస్తాయి.
*నానోసెన్సార్స్: మానవ శరీరంలోని రక్తంలో వ్యాధి సూచకాలను చాలా ముందస్తుగా గుర్తించి, డయాగ్నోసిస్‌ను అందించడాన్ని నానో పార్టికల్స్ సహాయపడుతున్నాయి. పర్సనలైజ్డ్ మెడిసిన్, రీజెనరేటివ్ థెరపీ (కణాలు/కణజాలాలు పునరుత్పాదకం), వ్యాక్సిన్ డెలివరీలలో కూడా భారీ పురోగతి సాధ్యం అవుతోంది.
*ఎలక్ట్రానిక్స్ రంగం: నానోస్కేల్ ట్రాన్సిస్టర్లు, గ్రాఫిన్& కార్బన్ నానోట్యూబ్స్ వంటి మెటీరియల్స్‌తో చిన్న, వేగవంతమైన, తక్కువ విద్యుత్ వాడే చిప్స్ తయారవుతున్నాయి. ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేai, వేరబుల్ & ఇంప్లాంటబుల్ సెన్సార్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ పురోగతికి దోహదపడతాయి.
*శక్తి వనరులు : ఎనర్జీ రంగంలోనూ నానోమెటీరియల్స్ సోలార్ ప్యానెల్స్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతాయి. ఎక్కువ కాంతిని గ్రహించగల, ఎక్కువ కాలం మన్నిక ఉండే, త్వరగా చార్జ్ అయ్యే అధునాతన బ్యాటరీలు ఈ సాంకేతికత ద్వారా తయారవుతున్నాయి. దీంతో ఇది పునరుత్పాదక ఇంధనాలను (రెన్యూవబుల్ ఎనర్జీ) మరింత సమర్థవంతం చేసి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు ఊతమిస్తుంది.
*పర్యావరణ రంగం: నానోఫిల్టర్లు & నానోపార్టికల్స్ ద్వారా నీటి నుండి కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగించవచ్చు. గాలి శుద్ధీకరణ, పర్యావరణ కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్విరాన్‌మెంటల్ రీమీడియేషన్(కాలుష్యం తొలగింపు)కు శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తాయి. అయితే నానోటెక్నాలజీ ఒక్కటే కాదు, దానిని ఏఐతో కలిపి వినియోగించుకుంటే మానవ జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. అయితే దీని సురక్షిత వినియోగం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై కూడా సరైన పరిశోధనలు ఇంకా కొనసాగాల్సి ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా భవిష్యత్ అంతా ఏఐ, నానో టెక్నాలజీదే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.






