రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, కొత్తకోట: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన వెంకట్ కుమార్(40) తన ఇద్దరు కొడుకులు మరియు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో కలిసి రాత్రి 12 గంటల సమయంలో మొహరం పండుగ సందర్భంగా పీర్లను కొడుకులకు, రాజు అనే వ్యక్తికి చూపించడానికి బైకుపై కొత్తకోటకు వెళ్తున్నాడు.

ఈ తరుణంలో కొత్తకోట నుంచి వనపర్తి వైపు అతివేగంగా వెళుతున్న AP 09CC8964 గల కారు స్థానిక బిపి ఆర్ గార్డెన్ సమీపంలో బైకును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ కుమార్‌కు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడం, రాజు అనే వ్యక్తికి కాలు విరగడం, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకట్ కుమార్ ఆసుపత్రిలో చనిపోయాడు. కాళ్లు విరిగిన రాజు, గాయపడ్డ ఇద్దరు పిల్లల్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story