- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ డోస్ పెంచిన రితిక నాయక్.. నడుము అందాలతో ఫ్యాన్స్ ఫిదా
చీరకట్టులో కుర్రాళ్ల మనసు దోచేసిన రితిక నాయక్.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ రితిక నాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'అశోక వనంలో అర్జున కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత 'హాయ్ నాన్న' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఇటీవల విడుదలైన 'మిరాయ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితిక, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా వరుస అవకాశాలతో కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
సినిమాల్లో ఇప్పటివరకు గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని రితిక నాయక్, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన స్టైలిష్ ఫొటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోల్లో రితిక బ్లూ బార్డర్ ఉన్న రెడ్ చీరతో పాటు బ్లూ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో స్టైలిష్‌గా పోజులిచ్చింది. చెవులకు పెద్ద ఇయర్‌రింగ్స్, చేతికి గాజులు ధరించి, జుట్టును సర్దుకుంటూ ఇచ్చిన స్టిల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె నాజూకైన నడుము అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Photos Courtesy: Instagram






