డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ

by Jakkula.Mamatha |

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నుంచి గ్రామపంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ
X

దిశ, ఎల్కతుర్తి: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నుంచి గ్రామపంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నడూ లేని విధంగా యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతిరోజు గమనించాలని సూచించారు. గంజాయి మత్తు పదార్థాల పట్ల పోలీసులది మాత్రమే బాధ్యత కాదు. ప్రతి పౌరుని బాధ్యతగా భావించి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రమేష్ బాబు, బక్కి శ్రీకాంత్, కోరేపున్నం, తంగళ్ళపల్లి రాజయ్య, రమేష్ , కుర్ర ప్రకాష్, తదితరులు ఉన్నారు.

Next Story