గ్రానైట్ కార్మికుడి అనుమానస్పద మృతి

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని ఎస్ఆర్‌కె గ్రానైట్ కంపెనీ నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో అస్సాం రాష్ట్రానికి చెందిన గ్రానైట్ కార్మికుడు దీపక్ ఘోష్ మృతి చెందాడు.

గ్రానైట్ కార్మికుడి అనుమానస్పద మృతి
X

దిశ, ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని ఎస్ఆర్‌కె గ్రానైట్ కంపెనీ నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో అస్సాం రాష్ట్రానికి చెందిన గ్రానైట్ కార్మికుడు దీపక్ ఘోష్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజుల క్రితం గ్రానైట్‌కు సెలవు ఉండటంతో మద్యం సేవించాడు. ఆ తర్వాత దీపక్ కనపడలేదని, అతనితో పని చేస్తున్న బంధువు తమ్ముడు బుధవారం రోజు ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడ కనిపించలేదు, గురువారం ఎస్ఆర్‌కె గ్రానైట్ నీటి సంపులో మృతి చెంది కనిపించాడు. కనిపించకుండా పోయిన దీపక్ గా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నరసింహారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story