- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా బంద్.. రైతుల్లో ఆందోళన
by Jakkula.Mamatha |
ఖమ్మం జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వ్యవసాయానికి సంబంధించిన త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వ్యవసాయానికి సంబంధించిన త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, మోటార్లు పనిచేయక పంటలకు నీరందించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏడి వెంకట్‌ని సంప్రదించగా.. సాంకేతిక కారణాలతో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వరి, పత్తి, మిర్చి, ఆయిల్ పామ్ తదితర పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
Next Story






