- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయపెట్టడానికి రెడీ అయిన తమన్నా.. హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి-3’ అప్డేట్ ఇస్తూ పోస్ట్
హారర్ కథలను ఎంచుకుంటూ భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ ఫేమస్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘రాగిణి’ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడో భాగం ‘రాగిణి 3’లో తమన్నా మెయిన్ లీడ్‌గా జాయిన్ అయ్యారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఓ వైపు వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తూ.. ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె ‘ఓ రొమియో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.. కానీ హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ‘ది వ్యాన్’ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. తాజాగా, తమన్నా మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నాళ్లు ప్రేమకథల్లో తనదైన నటనతో మెప్పించిన ఆమె.. రూట్ మార్చి హారర్ కథలను ఎంచుకుంటూ భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ ఫేమస్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘రాగిణి’ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడో భాగం ‘రాగిణి 3’లో తమన్నా మెయిన్ లీడ్‌గా జాయిన్ అయ్యారు.
ఈ సినిమా షూటింగ్ ఈరోజే అధికారికంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో Day 01 అని ఉన్న క్లాప్‌బోర్డ్‌ను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మునుపటి భాగాల కంటే సరికొత్త కథతో, క్రియేటివ్ టీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ హారర్ మిస్టరీలో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తుండగా, బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ సంస్థలు కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్, అమర్ బుటాలా, కుమార్ తౌరానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కంప్లీట్ హారర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే బాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.






