బోడుప్పల్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by Jakkula.Mamatha |

బోడుప్పల్‌లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

బోడుప్పల్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, మేడిపల్లి: బోడుప్పల్‌లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ నార్త్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఎస్సై ఏ.రవికుమార్, పీసీ రాఘవేంద్రతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్లాట్ నెంబర్ 54లో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. వారిని భోగంపేట నర్సిరెడ్డి(45), చిత్రీ రాంబాబు(48), బద్దం మైపాల్ రెడ్డి(58), అడెల్లా(41), అయ్యప్ప రెడ్డి(76)గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.20,300 నగదు, ఐదు స్మార్ట్‌ఫోన్లు, రెండు సెట్ల పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story