పూరీలో జగన్నాథ రథయాత్ర షురూ.. పోటెత్తిన భక్తులు

by Ajay Maddhiboyina |

ఒడిశాలోని పూరీలో ప్ర‌సిద్ధ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఉద‌యం 6గంట‌ల‌కు మంగ‌ళ‌హార‌తి ప‌ట్ట‌గా, ఉద‌యం 9.30గంట‌ల నుండి ప‌హండీ ఉత్స‌వం ప్రారంభ‌మైంది.

పూరీలో జగన్నాథ రథయాత్ర షురూ.. పోటెత్తిన భక్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఒడిశాలోని పూరీలో ప్ర‌సిద్ధ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఉద‌యం 6గంట‌ల‌కు మంగ‌ళ‌హార‌తి ప‌ట్ట‌గా, ఉద‌యం 9.30గంట‌ల నుండి ప‌హండీ ఉత్స‌వం ప్రారంభ‌మైంది. మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు ప‌హండీ ఉత్స‌వం జ‌రుగుతుంది. 2గంట‌ల నుండి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు పూరీ గ‌జ‌ప‌తి మ‌హారాజు ర‌థాల‌ను బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. సాయంత్రం 4గంట‌ల‌కు భ‌క్తులు ర‌థాల‌ను లాగ‌టం మొద‌లుపెడ‌తారు. ఇక ఇప్పటికే జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర వీక్షించేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. జ‌గ‌న్నాథుడు, బ‌ల‌భ‌ద్రుడు, సుభ‌ద్ర ర‌థాల‌ను లాగేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ర‌థ‌యాత్ర‌లో భ‌ద్ర‌త కోసం ఒడిశా ప్ర‌భుత్వం 13వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 19 మంది ఐపీఎస్ అధికారులు ర‌థ‌యాత్ర‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. 473 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ప‌రిశీలించేందుకు సిబ్బందిని నియ‌మించారు. భ‌క్తుల కోసం రైల్వేశాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది.

Next Story