- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి
కాప్రా డివిజన్‌లో ఎస్ఐఆర్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

దిశ, కాప్రా: కాప్రా డివిజన్‌లో ఎస్ఐఆర్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాప్రా డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రచార రథాలను గురువారం జెండా ఊపి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సర్ సర్వేలో ప్రతి అర్హుడైన ఓటరు బాధ్యతగా ఓటును నమోదు చేసుకోవాలన్నారు. అందుకు ఇంటింటికి వచ్చే బీఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫామ్‌లను తీసుకొని పూర్తి వివరాలను నమోదు చేసి తిరిగి బిఎల్ఓలకు అప్పగించాలన్నారు. అయితే ఈ ప్రక్రియపై ఓటర్లు అవగాహన లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
అయితే ఓటర్లకు సర్ సర్వే పై పూర్తి అవగాహన పెంచి ఓటరు నమోదు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు ఉండేలా బీఆర్ఎస్ పార్టీ తమదైన బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రథాలు కాలనీలో, బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి కుటుంబాన్ని కలుస్తూ.. సర్ సర్వే పై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలిపారు. ఇక కాప్రా డివిజన్‌లో ప్రచార రథాల వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన యువ నాయకుడు, బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్ సర్వేపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






