ఎల్లో అవుట్‌ఫిట్‌లో గ్లామర్ టచ్ ఇచ్చిన గర్వితా సాధ్వాని

by Pulgam srinivas |

ఎల్లో డ్రెస్‌లో ఎలిగెంట్ లుక్.. గర్వితా సాధ్వాని అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.

ఎల్లో అవుట్‌ఫిట్‌లో గ్లామర్ టచ్ ఇచ్చిన గర్వితా సాధ్వాని
X

దిశ, వెబ్ డెస్క్: మోడల్, టెలివిజన్ నటి గర్వితా సాధ్వాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' సీరియల్‌లో 'రూహీ బిర్లా' పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.




అంతకుముందు 'బాతే కుచ్ అన్‌కహీ సి' ధారావాహికలోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టెలివిజన్‌తో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తూ గర్వితా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.




ఇక సోషల్ మీడియాలోనూ గర్వితా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.




ఎల్లో కలర్ సింపుల్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చిన గర్వితా, కొన్ని ఫొటోల్లో చున్నీతో, మరికొన్నింటిలో చున్నీ లేకుండా ట్రెండీ లుక్‌లో మెరిశారు. ఈ ఫొటోషూట్‌లో చేతికి గాజులు, పెద్ద ఇయర్‌రింగ్స్ ధరించి, గాలికి తేలికగా ఎగిరే కురులతో ఆమె మరింత అందంగా కనిపించారు.




సింపుల్ అవుట్‌ఫిట్‌కే స్టైలిష్ టచ్ జోడిస్తూ గర్వితా తన ఎలిగెంట్ లుక్‌తో అభిమానులను ఫిదా చేశారు. ప్రస్తుతం ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story