- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్నటి నుంచి ఎర్రకోట మూసివేత.. ఎందుకంటే..?
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు సందర్శకులకు ఎర్రకోట మూసివేత: ఏఎస్ఐ అధికారిక ఉత్తర్వులు!

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) ను సాధారణ సందర్శకులు, పర్యాటకులకు జూలై 15 నుంచి మూసివేశారు. ఈ మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ASI) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే భారత 80 వ స్వాతంత్ర్య దినోత్సవ (80th Independence Day) వేడుకల ముందస్తు భద్రతా ఏర్పాట్లు, సన్నాహాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 'ప్రాచీన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల నిబంధనలు-1959' లోని రూల్ 5 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఏఎస్ఐ (ASI) పేర్కొంది.
జూలై 9వ తేదీ నాటి ఆర్డర్ ప్రకారం.. జూలై 15, 2026 నుంచి ఆగస్టు 15, 2026 నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయ్యేంత వరకు ఎర్రకోట కాంప్లెక్స్ లోనికి సాధారణ ప్రజల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, పరేడ్ రిహార్సల్స్, మౌలిక వసతుల పనుల కోసం ప్రతి ఏడాది ఈ ముందస్తు మూసివేత ప్రక్రియ సాధారణంగానే జరుగుతుందని ఏఎస్ఐ సీనియర్ అధికారి ఒకరు బుధవారం స్పష్టం చేశారు. పర్యాటకులు ఈ మార్పును గమనించి తమ ఢిల్లీ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు.






