ఇండియాలో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో శ్రీకాంత్.. వి.వి. వినాయక్

by Pulgam srinivas |

శ్రీకాంత్ కడుపునిండా తింటూనే స్లిమ్ ఫిజిక్, గ్లామర్‌ను మెయింటైన్ చేస్తారని వినాయక్ ప్రశంసించారు.

ఇండియాలో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో శ్రీకాంత్.. వి.వి. వినాయక్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ఊరమాస్ దర్శకుల్లో ఒకరైన వి.వి. వినాయక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, నటుడు శ్రీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయక్ మాట్లాడుతూ... "శ్రీకాంత్ వయసు పెరుగుతున్నా ఆయన అందం ఏమాత్రం తగ్గడం లేదు. చాలా ఏళ్లుగా అలాగే కనిపిస్తున్నారు. మరి అందుకోసం ఆయన కఠినమైన డైట్ పాటిస్తారా? లేదా గంటల తరబడి జిమ్‌లో కష్టపడతారా? అంటే అలాంటిదేమీ లేదు. ఆయనకు నచ్చిన ఆహారాన్ని కడుపునిండా తింటారు. అయినప్పటికీ అదే స్లిమ్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ, బూర బుగ్గలతో ఎంతో అందంగా కనిపిస్తుంటారు.

నా తెలిసినంత వరకు ఇండియాలో కడుపునిండా తింటూనే ఇంత అందంగా, ఫిట్‌గా ఉండే హీరోలు చాలా అరుదు" అని ప్రశంసించారు. ఇక శ్రీకాంత్ తాజాగా 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాలో లయ కథానాయికగా నటించగా, జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఆయన మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి. మరోవైపు, వి.వి. వినాయక్ 'చత్రపతి' హిందీ రీమేక్ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాకు కమిట్ కాలేదు.

Next Story