- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో సంచలనం.. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
హైదరాబాద్ మంగళహాట్‌లో డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ అరెస్ట్.. మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. మాదకద్రవ్యాల (Drugs) సరఫరా, వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఓ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ తనిఖీ ఆపరేషన్‌లో ఒక ప్రముఖ ఎమ్మెల్సీ (MLC) కుమారుడు పోలీసులకు పట్టుబడటం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. డ్రగ్స్ విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొంతమందిని పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.
మంగళహాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ నడుపుతున్న కొందరు వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు ఈ మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, స్వయంగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. భరత్‌తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరికొందరు బడా బాబుల పిల్లలను, కీలక నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని వెనుక ఉన్న అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు నిందితులను ముమ్మరంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా తాజా పరిస్థితుల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు దొరకడంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.






