- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పీఎస్ లో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పీఎస్ లో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా తమను నెట్టివేశారని ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై BNS132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబం నిర్ణయం మేరకే అంత్యక్రియలు జరగాలని స్పష్టం చేశారు. అప్పటికే ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో తమ విధులకు ఆటకం కలిగించారని, తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది.






