- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిత ప్రాంతాల పరిరక్షణే సుస్థిర నగరాభివృద్ధికి పునాది: లక్ష్మీ పార్థసారథి
దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ(ఆంధ్ర మహిళా సభ) ఆధ్వర్యంలో డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా 39వ మెమోరియల్ లెక్చర్ బుధవారం విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

దిశ, సికింద్రాబాద్: దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ(ఆంధ్ర మహిళా సభ) ఆధ్వర్యంలో డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా 39వ మెమోరియల్ లెక్చర్ బుధవారం విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి. లక్ష్మీ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ‘నగరాల అభివృద్ధి – హరిత ప్రాంతాల కోల్పోవడం: స్థిరమైన ప్రణాళిక అవసరం’ అంశంపై స్మారక ఉపన్యాసం చేశారు. వేగంగా విస్తరిస్తున్న నగరాల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
హరిత ప్రాంతాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అనుకూలమైన, స్థిరమైన నగరాల నిర్మాణంపై ప్రభుత్వాలు, ప్రణాళిక సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. అనంతరం ప్రస్తుత ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఉషా కందా మాట్లాడుతూ.. ఆవిడ ప్రస్తానం ముగ్గులు దిద్ది ఇంటిని చక్కదిద్దుకోవడం నుంచి, దేశాన్ని నడిపించడం, మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ, రాజ్యాంగ నిర్మాణం దాకా కొనసాగిందని తెలిపారు. దుర్గాబాయి దేశముఖ్ వేసిన అడుగులు, స్థాపించిన సంస్థలు నేటికీ ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, ఆమె చూపిన మార్గంలో పయనించడమే ఆ ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎం.లలిత కామేశ్వరి మరియు ఇతర ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు.






