- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీ పాత్రలే అసలైన బలం..‘టాక్సిక్’ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉండబోతోంది: తారా సుతారియా
హీరో యష్ ఎంతో పట్టుదలతో ఈ సినిమాను రూపొందించారని, వాళ్లతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ఈ చిత్రం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తారా సుతారియీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతమంది హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పలు వాయిదాల తర్వాత ఈ మూవీ ఆగస్టు26న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారా సుతారియా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. ‘టాక్సిక్’ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతృప్తిని, పరిపూర్ణతను ఇచ్చిందని తారా సుతారియా చెప్పారు. ‘టాక్సిక్’ సినిమాలో నటించడం తన కెరీర్‌లోనే మర్చిపోలేని ఒక మంచి అనుభవమని తారా సుతారియా అన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు తనకు చాలా సంతోషంగా ఉండేదని, అందుకే తన షూటింగ్ అయిపోయినా సరే క్యారవాన్‌కు వెళ్లకుండా సెట్స్‌లోనే ఉండిపోవాలనిపించేదని తెలిపారు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ చాలా క్లియర్ విజన్‌తో, హీరో యష్ ఎంతో పట్టుదలతో ఈ సినిమాను రూపొందించారని, వాళ్లతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.
ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరు ‘రెబెక్కా’ అని, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని తారా సుతారియా వెల్లడించారు. సాధారణంగా పెద్ద పెద్ద యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదని, కానీ ‘టాక్సిక్’లో స్త్రీ పాత్రలన్నీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మూవీలో కనిపించే ప్రతి హీరోయిన్ పాత్రకూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని, విజువల్స్ పరంగా ఈ సినిమా చాలా స్టైలిష్‌గా, హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా, ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు తారా సుతారియా స్పష్టం చేశారు. ఎంతోమంది అద్భుతమైన మహిళా నటీమణులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న అద్భుతమైన సహనటుడు యష్‌తో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. తామిద్దరం కలిసి నటించిన ప్రతి సన్నివేశాన్ని సెట్స్‌లో ఎంతో ఆస్వాదించామని, థియేటర్లలో ఈ మ్యాజిక్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు.






