- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతున్న సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష..హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరిక.. 9 కేజీలకు పైగా తగ్గిన బరువు, షుగర్ లెవెల్ 80 mg/dL గా నమోదు: డాక్టర్ సతీష్ లాంబా!

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినన విషయం తెలిసిందే. అయితే ఆయన దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సతీష్ లాంబా గురువారం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
హెల్త్ బులెటిన్ వివరాలను డాక్టర్ సతీష్ లాంబా వివరిస్తూ.. "ఈరోజుతో సోనమ్ వాంగ్‌చుక్ గారి నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన రెండు అత్యంత కీలకమైన పారామీటర్లను (Vitals) మీముందుకు తెస్తున్నాను. సుదీర్ఘ ఉపవాసం కారణంగా ఈ 19 రోజుల్లో ఆయన ఏకంగా 9 కేజీలకు పైగా బరువు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ (Blood Sugar) 80 mg/dL గా నమోదైంది. అలాగే పల్స్ రేట్ నిమిషానికి 72 బీట్స్‌గా ఉంది" అని తెలిపారు.
ఆయన పడుకున్నప్పుడు రక్తపోటు (Blood Pressure) 105/61 mmHg గా, కూర్చున్నప్పుడు 101/65 mmHg గా రికార్డైంది. నిరంతర ఉపవాసం వల్ల ఆయన శరీరం చాలా బలహీనపడినప్పటికీ, ప్రస్తుతానికి హైడ్రేషన్ (Hydration) సంతృప్తికరంగానే ఉందని, ఆయన మానసికంగా చాలా చురుగ్గా (Mentally Alert) ఉన్నారని డాక్టర్ లాంబా స్పష్టం చేశారు. అయితే, రోజురోజుకూ బరువు పడిపోతుండటం, కండరాల క్షీణత పెరిగే ప్రమాదం ఉన్నందున వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని 24 గంటల పాటు నిశితంగా గమనిస్తోంది. మరోవైపు వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నారు.






