- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకుడిగా నా ప్రయాణం అక్కడే మొదలైంది.. జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్
తనకు ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ప్రేమకథ కంటే ఒక గ్యాంగ్ నేపథ్యంలో నడిచే సాహసోపేతమైన దొంగతనం సినిమా తీయడమే ఎక్కువ ఇష్టమని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘సిగ్మా’. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే జాసన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, దర్శకుడు జాసన్ సంజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించాలని అనుకున్నప్పుడు తమ మొదటి ఛాయిస్ సందీప్ కిషనే అని సంజయ్ చెప్పారు. సందీప్‌కు ఈ కథ, అందులోని క్యారెక్టరైజేషన్, స్క్రీన్‌ప్లే బాగా నచ్చడంతో కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. సాధారణంగా చిన్న వయసులోనే డైరెక్టర్ అవుతుండటంతో అందరూ తన నుండి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఆశించారని, కానీ తనకు ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ప్రేమకథ కంటే ఒక గ్యాంగ్ నేపథ్యంలో నడిచే సాహసోపేతమైన దొంగతనం సినిమా తీయడమే ఎక్కువ ఇష్టమని స్పష్టం చేశారు.
అలాగే తన నటన గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఈ ‘సిగ్మా’ సినిమా విడుదల తర్వాతే యాక్టింగ్ గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇంత చిన్న వయసులోనే దర్శకుడిగా మారాలనే కల ఎలా మొదలైందనే ప్రశ్నపై సంజయ్ స్పందిస్తూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి రావడం వల్ల చిన్నప్పటి నుంచే షూటింగ్ స్పాట్‌లకు వెళ్లడం, ప్రీమియర్ షోలు చూడటం తనకు అలవాటయిందని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సినిమాలు చూసే అవకాశం ఉందని, తాను ఏ మూవీ చూసినా కథను చెప్పే విధానాన్ని, అది ఎలా మొదలై ఎలా సాగుతుందనే విషయాలను ఒక ఆటలా గమనించేవాడినని అన్నారు. సినిమా చూసిన ప్రతిసారీ తన స్నేహితుల దగ్గరకు వెళ్లి ఎంతో ఉత్సాహంగా ఆ కథలను వివరించేవాడినని, వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక కథకుడిగా తన ప్రయాణం నిజానికి అక్కడే మొదలైందని సంజయ్ ఎమోషనల్ అయ్యారు.






