- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కడ పడితే అక్కడ కెమెరాలతో నా వెంటపడకండి.. ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అవుతూ మౌనీ రాయ్ సంచలన పోస్ట్
తన ఫొటోలు తీయమని తాను ఎప్పుడూ మీడియా వాళ్లను పిలవలేదని, ఇకపై కూడా తనను ఫాలో అవ్వద్దని ఆమె స్పష్టం చేశారు.

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీలు ఎక్కడ పడితే అక్కడ, ఏ సమయంలో కనిపిస్తే ఆ సమయంలో కెమెరాలు పట్టుకుని ఫొటోలు తీస్తూ, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. ఎయిర్‌పోర్ట్, హోటల్స్, జిమ్, చివరకు వాళ్ల పర్సనల్ పనుల కోసం బయటకు వచ్చినా వదలకుండా ఫొటోగ్రాఫర్లు వెంటపడుతున్నారు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా ప్రవర్తిస్తూ.. ఇబ్బంది పెడుతున్నారు. అయితే కొందరు హీరోయిన్ల వెనకాల నుంచి బాడీ పార్ట్స్ చూపిస్తూ వీడియోలు తీయడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎంతోమంది తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్‌కు ఎదురైంది. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కారు ఎక్కి వెళ్తున్నా సరే కెమెరాలతో రికార్డ్ చేయడానికి ప్రయత్నించడంతో, విసిగిపోయి ఫొటోలు తీయడం ఆపేయమని గట్టిగా చెప్పారు.
మౌనీ రాయ్ ఇటీవల ముంబైలో మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ గొడవపై మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. తన ఫొటోలు తీయమని తాను ఎప్పుడూ మీడియా వాళ్లను పిలవలేదని, ఇకపై కూడా తనను ఫాలో అవ్వద్దని ఆమె స్పష్టం చేశారు. మీడియా వాళ్లపై తనకు గౌరవం ఉందని, కానీ తన పర్సనల్ స్పేస్‌ను గౌరవించి తన జోలికి రావద్దని కోరారు. ఇక ముందెప్పుడైనా తాను కెమెరాలకు చిక్కినా.. అది తాను పిలిస్తే వచ్చింది కాదని జనాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కెమెరా హడావిడి తనకు అస్సలు నచ్చడం లేదని, దయచేసి ఇక్కడితో ఆపేయాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మౌనీ రాయ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తీసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ లో నటించారు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ క్రేజీ మూవీలో మౌనీ రాయ్ తన నటనతో ప్రశంసలు పొందారు.






