- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం కీలక నిర్ణయం.. ఇంధన ఎగుమతులపై రూ. 7 పెంపు,పెట్రోల్‌పై తగ్గింపు!
ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ రేట్లు పెరగడంతో డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి పన్నును రూ. 7 పెంచిన కేంద్రం.. పెట్రోల్‌పై రూ. 1.5 తగ్గింపు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ యుద్ధ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ముడి చమురు (గ్లోబల్ క్రూడాయిల్) ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ చమురు కంపెనీల ఎగుమతులపై నియంత్రణ విధించేందుకు గానూ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF - విమాన ఇంధనం) ఎగుమతులపై విధించే అదనపు పన్నును ఏకంగా రూ. 7 మేర పెంచింది. దీనితో ఇప్పటివరకు లీటర్‌పై రూ. 8.5 గా ఉన్న పన్ను ఒక్కసారిగా రూ. 15.5 కి చేరింది. అయితే, పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును మాత్రం లీటర్‌కు రూ. 4 నుంచి రూ. 2.5 కి తగ్గిస్తూ సామాన్యులకు కొంత ఊరటనిచ్చింది. ఈ సవరించిన కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో, దేశీయ రిఫైనరీలు స్థానిక మార్కెట్లను వదిలి విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు గడించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై పన్నులు పెంచినప్పటికీ, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండటంతో రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పెరగొచ్చనే ఆందోళనలు సామాన్య వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి.






