శ్రీలీల నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు..మరోసారి అదే తప్పు

by Pulgam srinivas |

శ్రీలీల, అజిత్ కుమార్ సినిమాలో వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

శ్రీలీల నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు..మరోసారి అదే తప్పు
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఏ సినిమా చేయాలనే దానికంటే, ఏ సినిమాను వదులుకోవాలనే నిర్ణయం కూడా చాలా కీలకమని సినీ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. సరైన నిర్ణయాలు తీసుకున్న హీరోయిన్లే ఎక్కువ కాలం స్టార్‌డమ్‌ను కొనసాగించగలరని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో శ్రీలీల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించిన శ్రీలీలకు భారీ విజయాలు తక్కువే అయినప్పటికీ, ఆమెకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

కొంతకాలం క్రితం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రంలో మొదట శ్రీలీలనే హీరోయిన్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అనంతరం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటీవల విడుదలైన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, శ్రీలీల ఆ సినిమాను వదులుకోవడం పెద్ద తప్పిదమని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమా చేసి ఉంటే ఆమె ఖాతాలో మరో భారీ విజయం చేరేదని అభిమానులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో శ్రీలీల మరో అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారని, అయితే డేట్స్ సమస్య కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో మరోసారి శ్రీలీల నిర్ణయాలపై అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఏదేమైనా హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా శ్రీలీల తన క్రేజ్‌ను మాత్రం అలాగే కొనసాగిస్తోంది.

Next Story