Manchu Manoj : మంచు మనోజ్ దెబ్బలపై అనుమానాలున్నాయి : ఆసుపత్రి వైద్య బృందం

by Muthe.Rajitha |   (  Updated:2024-12-08 16:41:47  IST  )

మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీలో తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Manchu Manoj : మంచు మనోజ్ దెబ్బలపై అనుమానాలున్నాయి : ఆసుపత్రి వైద్య బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీలో తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరోసారి వీరి కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం మోహన్ బాబు స్కూల్ కు చెందిన కొంతమంది గుండాలతో.. తనపై, తన భార్యపై దాడి చేయించాడాని మంచు మనోజ్(Manchu Manoj) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తర్వాత మనోజే తనపై దాడికి పాల్పడ్డాడు అంటూ మోహన్ బాబు స్టేషన్ మెట్లు ఎక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం.. భార్యతో కలసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారాహిల్స్‌ లోని టీఎక్స్ ఆసుపత్రి(TX Hospital)లో చేరగా.. ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించింది వైద్యబృందం. కొద్దిసేపటి క్రితం మనోజ్ ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తూ.. ఆయనకు సిటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ ఎక్స్‌రే పరీక్షలు చేయగా.. ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు కూడా తాము సమాచారం అందించామని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళినట్లు తెలిఏ జేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు మనోజ్ ఇంటికి వెళ్ళి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనున్నారని సమాచారం.


👉Also Read: Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు.. వైరల్‌గా మారిన మోహన్ బాబు పోస్ట్

Next Story