డబ్బు కోసమే నేరగాళ్లతో డేటింగ్ చేస్తున్నారు.. Sushmita Senపై ఆగని ట్రోలింగ్

by Manoj |   (  Updated:2022-07-19 09:34:15  IST  )

దిశ, సినిమా: మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది..Latest Telugu News

డబ్బు కోసమే నేరగాళ్లతో డేటింగ్ చేస్తున్నారు.. Sushmita Senపై ఆగని ట్రోలింగ్
X

దిశ, సినిమా: మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (Sushmita Sen) తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది. ఇటీవల లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత 'గోల్డ్ డిగ్గర్' అంటూ భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయిన నటి.. 'ఈ ప్రపంచాన్ని చూసి మనస్సు ముక్కలైంది. పరిచయం లేనివారు కూడా నా వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తున్నారు. కొంత మంది మేధావులు ఫన్నీ గాసిప్స్‌ను ప్రచారం చేస్తున్నారు. నేనొక 'గోల్డ్ డిగ్గర్' అని చెప్పడం నిజంగా బాధించింది.

నిజానికి నాకు గోల్డ్ కన్నా వజ్రాలంటే చాలా ఇష్టం. ప్రతి విషయంలో మీ ఆమోదం, పొగడ్తలతో జీవితాన్ని గడపలేను. నేను సంతోషంగా ఉన్నా' అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది. ఇక సుస్మితను ఎంతగానో అభిమానించినట్టు చెప్పిన 'లజ్జ' రచయిత తస్లీమా నస్రీన్.. లతిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆమెపై గౌరవం పోయిందని, అనేక నేరాలు చేసిన వ్యక్తితో డేటింగ్ చేయడమంటే డబ్బుకు అమ్ముడు పోయినట్లే అని చెప్పడం విశేషం.


Next Story