- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
96 రన్స్ చేసినా దక్కని ఫైనల్ బెర్త్.. నెట్టింట వైరల్ అవుతున్న సూర్యవంశీ కన్నీటి దృశ్యం
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఒంటరి పోరాటం చేసిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు సూర్యవంశీ (96 రన్స్). జట్టు ఓటమితో మైదానంలోనే కన్నీటి పర్యంతం..15 ఏళ్ల వయసులో అతడి డెడికేషన్‌కు నెటిజన్లు జోహార్లు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి న్యూ చంఢీఘర్‌లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్స్ (IPL Playoffs) భాగంగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఇతర బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరుతున్నా, సూర్యవంశీ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేశాడు. ఎంతో ఓపికతో ఆడుతూ కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకుని, 96 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి వీరోచిత బ్యాటింగ్ వల్లే గుజరాత్ టైటాన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 200 పరుగులకు పైగా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. తన జట్టుకు ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఈ యువ ఆటగాడు ప్రాణం పెట్టి ఆడాడు.
అయితే, ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలుకావడంతో సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు ఓడిపోయిందనే బాధను తట్టుకోలేక మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ పట్ల అతడు చూపిన అంకితభావం (Dedication), గెలవాలనే కసిని చూసి క్రికెట్ అభిమానులు మరియు విశ్లేషకులు ఫిదా అవుతున్నారు. ఓడిపోయినా ప్రతీ ఒక్కరి మనసు గెలుచుకున్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం సూర్యవంశీ కన్నీరు పెడుతూ కూర్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ.. ట్రోఫి గెలవలేకపోయిన ప్రపంచ క్రికెట్ అభిమానుల మనుసులను వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






