- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి స్థలంలో ట్రాక్టర్ నిలిపిన వ్యక్తి దారుణ హత్య..
దిశ, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన స్థలంలోకి ట్రాక్టర్

దిశ, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన స్థలంలోకి ట్రాక్టర్ నిలిపినందుకు వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన కేటీదొడ్డి మండలం మల్లాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్వ మల్లయ్య , కుర్వ గోవిందు అన్నదమ్ములు. వీరి ఇంటి పక్కన ఉన్న బోయ రాఘప్పల మౌలాలి తో చాలా రోజులుగా స్థల వివాదం ఉంది. ఈ విషయం పై గతంలో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో శనివారం పంచాయతీ నిర్వహించి.. సర్వేయర్ సహకారంతో రెండు కుటుంబాలకు హద్దులు చూపించారు.
అయిన ఆదివారం సాయంత్రం రాఘప్పల మౌలాలి ఇంటి స్థలంలో కుర్వ గోవిందు ట్రాక్టర్ ఉంచడం జరిగింది. దీంతో వివాదం స్టార్ట్ అయింది. మౌలాలి ట్రాక్టర్ తీయడానికి వెళ్లగా కర్రలతో దాడి చేయడంతో మౌలాలి మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు కుర్వ గోవిందు ట్రాక్టర్ తగలపెట్టారు. సమాచారం తెలుసుకున్న గద్వాల్ సీఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి. మృతదేహాన్ని గద్వాల ఆసుపత్రికి తరలించారు.






