- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.60 లక్షల వ్యవసాయ ట్రాన్సఫార్మర్లపై సర్వే
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు డిస్కంను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం వేగం పెంచింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం)ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం వేగం పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలో మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ (ఎంసీఏ) ఆమోదం పొందడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలుs) పూర్తి చేయడంతో పాటు కీలకంగా భావించే ఉద్యోగుల విభజన ప్రక్రియ సైతం తుది దశకు చేరుకున్నాయి. క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి కీలకమైన ఆస్తుల విభజనలో భాగంగా మొదటగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వేపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 లక్షల వ్యవసాయ ట్రాన్సఫార్మర్లు వున్నాయి. సెక్షన్ కు మూడు బృందాల చొప్పున 744 ఆపరేషన్ సెక్షన్ల పరిధిలో 2232 బృందాలు నిత్యం ఈ సర్వే లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. సర్వే కోసం రైతు డిస్కం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్లు తమ పరిధిలోని వ్యవసాయ డీటీఆర్‌లకు సంబంధించిన స్ట్రక్చర్, డీటీఆర్ ఎంబోస్ నంబర్, నేమ్‌ప్లేట్ వివరాలను ఫోటోల రూపంలో సేకరించి, ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల జియో కోఆర్డినేట్లను నమోదు చేయనున్నారు.
జూన్ 2వ తేదీ నుండి రైతు డిస్కం...
ప్రభత్వ ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కంల సీఎండీలు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు డిస్కం పరిధిలోకి తీసుకురానున్న వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వేపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పైలట్ ప్రాతిపదికన కొన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 28వ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) రైతు డిస్కంకు లైసెన్స్ మంజూరు అంశంపై బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అసెట్ మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయితే, ప్రభుత్వ నిర్ణయానుసారం జూన్ 2వ తేదీ నుండి రైతు డిస్కం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీజీఎస్పీడీసీఎల్సీఎండీ జితేష్ వి. పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, డా. నరసింహులు, మోహన్ రావు, మధుసూదన్, శివాజీ, కృష్ణా రెడ్డి, తిరుపతి రెడ్డి, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు.






