మక్తల్ విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

by Jakkula.Mamatha |

విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

మక్తల్ విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మక్తల్: విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్సీ, డీఈటీ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లక్షలాది రూపాయల విలువచేసే ట్రాన్స్‌ఫారమ్ స్తంభాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకోగా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్‌ఫారమ్ విలువ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుందని బాధిత రైతులు అంటున్నారు.

సదరు కొంతమంది రైతులు అవసరాల కోసం ట్రాన్స్‌ఫారమ్‌లు విద్యుత్ స్తంభాలకోసం డీడీలు కట్టి నెలలు కావస్తున్నా వారికి ట్రాన్స్‌ఫారమ్ ఇవ్వకుండా కాసుల వర్షం కురిపించిన వారికే ఇచ్చినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్టిమేట్స్ అనుగుణంగా మంజూరైన ట్రాన్స్‌ఫారమ్ స్థంబాల డీడీలు కట్టిన వారికి చేరకుండా మాయమయ్యని తనిఖీలు బయటపడ్డ కుంభకోణంపై సమాధానం చెప్పడానికి వీలుకాదన్న ఉద్దేశంతో సదరు విద్యుత్ అధికారి గైర్హాజరయ్యారు అయినట్లు సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో కాంట్రాక్టర్ గా పని చేసిన వారు చెప్పిన సమాచారం ప్రకారం పత్రికల్లో కథనాలు రాస్తే ప్రస్తుతం ఉన్న విద్యుత్ కాంట్రాక్టర్ల నుంచి విలేకరులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. సబ్ స్టేషన్ లో జరిగిన అవినీతి తనిఖీలను బయట పెట్టే తమ పరువు పోతుందని గోప్యంగా ఉంచారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయాలు..

ఇటీవల మక్తల్ లో విద్యుత్ కల్లోలం ‘దిశ’లో వచ్చిన వార్తకు విజిలెన్స్ అధికారులు రెండు రోజుల కిందట తనిఖీలు చేసినట్లుగా సమాచారం. నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులు గోప్యంగా ఉంచారు. జరిగిన అవినీతి పై అధికారులకు సమాధానం చెప్పలేక అధికారి సెలవులో వెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ వారు చెప్పిన తనిఖీల్లో దాదాపు 64 ట్రాన్స్‌ఫారమ్‌లు దాదాపు వందలకొద్దీ విద్యుత్ స్తంభాలు లెక్కలు కనిపించలేదని సమాచారం. విషయాన్ని బహిరంగంగా చెప్పకుండా విద్యుత్ అధికారులు గోప్యంగా ఉంచినట్లు విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలో బయటపడ్డ విషయాలు విలేకరులకు వారు తెలిపారు.

అవినీతికి బాధ్యులెవరు చర్యలు ఎవరిపైన..

లక్షలాది రూపాయల విలువ చేసే ట్రాన్స్‌ఫారమ్‌లు విద్యుత్ స్తంభాలు బహిరంగ మార్కెట్లో తరలించి అమ్ముకున్న విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీలు వెలుగులోకి రావడంతో చర్యలు ఎవరి పై ఉంటాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మంజూరైన ట్రాన్స్‌ఫారమ్ వైర్లు స్తంభాలు సబ్ స్టేషన్ పరిధిలో ఉండాలి. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు తమ ఇంటి దగ్గర జోగల్లో నిల్వ ఉంచడం జరిగిందని తనిఖీల్లో బయటపడింది. అవినీతి ఇంత జరిగిన వేటు ఎవరిపై ఉంటుందన్నది చర్చ.

Next Story