- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గత కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) గత కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. కొద్ది రోజులుగా.. ముస్లిం సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ(ఎం) (CPI-M) పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అడ్వకేట్ నిజాం పాషా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్‌ను కోరారు.
పిటిషనర్ల ప్రధాన ఆరోపణలు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిమంత బిశ్వ శర్మ.. ఒక వర్గానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు (Hate speech) చేస్తున్నారని అడ్వకేట్ నిజాం పాషా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇటీవల అస్సాం బీజేపీ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోను ఆయన ప్రస్తావించారు. అందులో ముఖ్యమంత్రి తుపాకీతో ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లుగా చిత్రీకరించారని, ఇది 'పాయింట్ బ్లాంక్ షాట్' అనే శీర్షికతో వైరల్ అయిందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ అంశాన్ని విన్న సీజేఐ సూర్యకాంత్ (CJI Suryakanth) కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, రాజకీయ పోరాటంలో కొంత భాగం సుప్రీంకోర్టులో కూడా జరుగుతోంది. అదే అసలు సమస్య" అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల వ్యూహాలను కోర్టు విచారణల ద్వారా ఎదుర్కోవాలని చూడటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని, తదుపరి విచారణ తేదీని నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. కాగా ఆ వీడియో వ్యవహారం ఇప్పటికే అస్సాంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ ఇది 'నరమేధానికి ప్రేరేపించడమే' అని విమర్శించగా, బీజేపీ మాత్రం ఇది అక్రమ చొరబాటుదారులను ఉద్దేశించి చేసిన వీడియో అని సమర్థించుకుంది. కాగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు.






