18 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

by Malleboina Mahesh |

ఇటీవల లైంగిక దాడికి గురైన 18 ఏళ్ల బాధితురాలికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లైంగిక దాడి కారణంగా బాలిక గర్భం దాల్చింది.

18 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల లైంగిక దాడికి గురైన 18 ఏళ్ల బాధితురాలికి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. లైంగిక దాడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో ఆమె ప్రస్తుతం 30 వారాల గర్భాన్ని కలిగి ఉండగా.. దానిని వైద్యపరంగా ముగించేందుకు (Medical Termination of Pregnancy) అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్ బి.వి. నాగరత్న (Justice B.V. Nagaratna), జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ (Justice Ujjal Bhuyan)లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. గర్భం దాల్చిన సమయం పెరిగినప్పటికీ, బాధితురాలి మానసిక స్థితి, ఆమె హక్కులను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. మహిళకు తన శరీరంపై సంపూర్ణ హక్కు ఉంటుందని, పునరుత్పత్తి ఎంపిక అనేది అత్యంత ప్రధానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇష్టం లేకపోయినా ఒక మహిళ తన గర్భాన్ని కొనసాగించాలని ఏ కోర్టు కూడా బలవంతం చేయలేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బాధితురాలు గర్భం దాల్చడానికి కారణమైన ఘటన, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆ శిశువును మోయడం వల్ల కలిగే మానసిక వేదనను కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

చివరగా, గర్భంలో ఉన్న శిశువు అక్రమ సంబంధం వల్ల లేదా అఘాయిత్యం వల్ల కలిగింది కావడం, పైగా తల్లి ఆ బిడ్డను కనడానికి సిద్ధంగా లేకపోవడం అనే అంశాలే ఇక్కడ ప్రధానమని కోర్టు పేర్కొంది. "తల్లి యొక్క పునరుత్పత్తి స్వయంప్రతిపత్తికి (Reproductive Autonomy) ప్రాధాన్యత ఇవ్వాలి" అని చెబుతూ, అప్పీలు దారు గర్భాన్ని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Next Story