- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన చార్జీల పెంపుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
పండగల సమయంలో ఇష్టారీతిన విమాన చార్జీలు పెంచుతూ ఎయిర్ లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది.

దిశ, వెబ్ డెస్క్ : పండగల సమయంలో ఇష్టారీతిన విమాన చార్జీలు పెంచుతూ ఎయిర్ లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రయాణికులపై జరుగుతున్న స్పష్టమైన "దోపిడీ" అని వ్యాఖ్యానించింది. విపరీతంగా పెంచుతున్న విమాన చార్జీలపై దాఖలైన పిల్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA)లకు నోటీసులు జారీ చేసింది. పండుగలు, సెలవులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే అంతరయాల సమయంలో ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలను 2–3 రెట్లు పెంచుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
టికెట్ ధరలను నియంత్రించేందుకు స్పష్టమైన, బైండింగ్ నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ధరల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయని, అవసరమైతే కోర్టు తప్పకుండా జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అదనపు ఛార్జీలు, ఫ్రీ చెక్-ఇన్ బ్యాగేజ్ వెయిట్‌ను 15 కేజీలకు తగ్గించడం వంటి అంశాలపై సరైన నియంత్రణ లేకపోవడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై కేంద్రం, DGCA నాలుగు వారాల్లో స్పందించాలని, తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది.






