సుప్రీంకోర్టు సీరియస్.. ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకాన్ని ఉపసంహరించుకున్న NCERT

by Malleboina Mahesh |

న్యాయవ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశాల నేపథ్యంలో NCERT ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ (Part-2) పుస్తకాన్ని ఉపసంహరించుకుంది. పుస్తక ప్రతులను తిరిగి ఇవ్వాలని, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని NCERT కోరింది.

సుప్రీంకోర్టు సీరియస్.. ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకాన్ని ఉపసంహరించుకున్న NCERT
X

దిశ, వెబ్ డెస్క్: ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం 'Exploring Society: India and Beyond' (Part 2)అనే పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం 'Exploring Society: India and Beyond' (Part 2)ను ఉపసంహరించుకుంది. ఈ పుస్తకంలోని 'Role of judiciary in Our Society' (మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర) అనే చాప్టర్‌లో న్యాయవ్యవస్థలో అవినీతి, కేసుల జాప్యంపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని భావించిన కోర్టు, ఈ పుస్తకంపై ఫిబ్రవరి 26, 2026 న సంపూర్ణ నిషేధం (Blanket Ban) విధించింది.

దీంతో సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ రోజు(27-02-2026)న NCERT ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అందులో ఈ , ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం 'Exploring Society: India and Beyond' (Part 2) పుస్తకాన్ని, దానికి సంబంధించిన పిడిఎఫ్ (PDF) ప్రతులను ఎవరైనా కలిగి ఉంటే వెంటనే తిరిగి ఇవ్వాలని కోరింది. అలాగే సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చాప్టర్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే, దానిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాస్పద అంశాలను తొలగించి, న్యాయ నిపుణుల సలహాతో ఈ చాప్టర్‌ను తిరిగి రాస్తామని, కొత్త విద్యా సంవత్సరం (2026-27) నాటికి సవరించిన పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా NCERT ప్రకటించింది.

Next Story