- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A'పై సుప్రీంకోర్టులో భిన్న తీర్పు
అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A'పై సుప్రీంకోర్టు భిన్న తీర్పును ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A'పై సుప్రీంకోర్టు (Supreme Court) భిన్న తీర్పును ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై పోలీసులు విచారణ జరపాలంటే ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఈ సెక్షన్ చెబుతోంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్ (Justice K.V. Viswanathan), జస్టిస్ బి.వి. నాగరత్న (B.V. Nagarathna)లతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. జస్టిస్ విశ్వనాథన్ ఈ సెక్షన్‌ను సమర్థించగా, జస్టిస్ నాగరత్న దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఈ అంశాన్ని తగిన బెంచ్‌కు బదిలీ చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి (Chief Justice of India) నివేదించారు.
జస్టిస్ విశ్వనాథన్ తన తీర్పులో భగవద్గీతను ప్రస్తావిస్తూ.. "ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే, ఆ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదు," అని పేర్కొంటూ, అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరమని అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదని ఆమె స్పష్టం చేశారు.
Read More..






