- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నించే గొంతులను అణచివేయడం బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను, అలాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన.

దిశ, ఎల్కతుర్తి : ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను, అలాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన నీట్ పేపర్ లీక్‌పై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయడానికే పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చేసే పోరాటాన్ని ఎలాంటి నిర్బంధాలతోనూ ఆపలేరని స్పష్టం చేశారు.
నీట్ పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపైనే లాఠీలు ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ముప్పు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.






