- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికాసేపట్లో మ్యాచ్...వైభవ్ కు బిగ్ షాక్ ఇచ్చిన అయ్యర్ !
మరికాసేపట్లో మ్యాచ్ ఉండగా వైభవ్ ఆడటంపై శ్రేయస్ అయ్యర్ ట్విస్ట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య మరికాసేపట్లో తొలి టీ20 ప్రారంభం కానుంది. హరారే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేటి మ్యాచ్ లో వైభవ్ ను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యారట. అతని స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని సమాచారం.
అంటే అభిషేక్ శర్మతో ఇషాన్ కిషన్ జోడిగా ఆడనున్నాడన్నమాట. ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో.. జింబాబ్వేను లైట్ తీసుకోకూడదని అనుకుంటున్నారట. అందుకే మొదటి మ్యాచ్ లో వైభవ్ ను వాటర్ బాయ్ గానే వినియోగించుకునే ఆలోచనలో అయ్యర్ ఉన్నట్లు తెలుస్తోంది. బౌలర్లుగా ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ బరిలో దిగే ఛాన్సులు ఉన్నాయి. యాష్ ఠాకూర్, సూర్యాన్ష్ షెగ్డే కూడా తుది జట్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.






