- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా పెంపు
దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అధిగమించేందుకు 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ల కోటాను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, హోటళ్లు, విద్యార్థులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో... 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ల కోటాను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సిలిండర్ల పంపిణీపై ఉన్న 20% పరిమితిని ప్రభుత్వం పూర్తిగా సడలించింది. వలస కార్మికులకు సగటు రోజువారీ సరఫరా ఆధారంగా, డైలీ అలాట్‌మెంట్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా, భారత్‌కు జరిగే ఎల్‌పీజీ దిగుమతుల సరఫరాలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చిన్న సిలిండర్ల కోసం డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది.
గణాంకాలను గమనిస్తే.. మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల నుండి పదమూడు లక్షల వరకు 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఒక్క ఏప్రిల్ 7వ తేదీన మాత్రమే 1.1 లక్షలకు పైగా అమ్మకాలు జరగడం, మార్కెట్‌లో ఈ చిన్న సిలిండర్ల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. వలస కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారికి గ్యాస్ కొరత లేకుండా చూడటమే ఈ నిర్ణయానికి కారణం అని అధికారులు చెబుతున్నారు. హర్మూజ్ జలసంధి సంక్షోభం ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియని పరిస్థితుల్లో, ప్రభుత్వం తీసుకున్న ఈ ముందు జాగ్రత్త చర్య పట్టణాల్లోని సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.






