- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్‌లాండ్ స్వాధీనం దిశగా అగ్రరాజ్యం అడుగులు.. స్టేట్ మెర్జ్ - రాష్ట్ర హోదా పేరుతో బిల్లు
గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా (America) వడివడిగా అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా (America) వడివడిగా అడుగులు వేస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫ్లోరిడా నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ (Randy Fine) ఇవాళ ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్ యాక్ట్’ (Greenland Annexation and Statehood Act) పేరుతో ఒక బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) డెన్మార్క్‌తో చర్చలు జరిపి లేదా అవసరమైన ఏ చర్యలు తీసుకుని అయినా గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా స్వాధీనం చేసుకోవచ్చని ఆ బిల్‌లో స్పష్టం చేశారు. అదేవిధంగా దానిని టెరిటరీగా మార్చిన తర్వాత, రాష్ట్ర హోదా ఇవ్వడానికి అవసరమైన చట్ట సవరణలపై కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించి ఆమోదం పొందిన వెంటనే గ్రీన్‌లాండ్ అమెరికా 51వ స్టేట్‌గా మారే అవకాశం ఉంది.
‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్ యాక్ట్’ బిల్లుపై రాండీ ఫైన్ మాట్లాడుతూ.. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాలు తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నాయని, గ్రీన్‌లాండ్ (Green Land)ను నియంత్రించడం ద్వారా అమెరికా తన ఉత్తర సరిహద్దును రక్షించుకోవచ్చని, కీలక షిప్పింగ్ లేన్‌లు, జాతీయ భద్రతను బలోపేతం చేయవచ్చని సభలో ప్రస్తావించారు. ట్రంప్ సర్కార్ ఆర్కిటిక్‌లో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో పని చేస్తోందని రాండీ ఫైన్ అన్నారు.






