- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎండలు.. సాయంత్రం వేళ పిడుగుల వాన!
తెలంగాణలో నేడు వాతావరణంలో విపరీతమైన మార్పులు! మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం నుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుపాను వచ్చే అవకాశం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈరోజు వాతావరణం భారీ మార్పులకు లోనవనుంది. మధ్యాహ్నం వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించేలా ఎండలు మండుతాయని. మెజారిటీ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. అలాగే సాయంత్రం వేళకు వాతావరణం చల్లబడి, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన తుపానులు వచ్చే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ హెచ్చరించింది.
ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇదే తరహా వాతావరణం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత 42 డిగ్రీల వరకు ఉండగా, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వల్ల ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రయాణీకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, పిడుగుల భయం ఉన్నందున ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.






