Sunny Leone: భయపెట్టేందుకు వచ్చేస్తున్న సన్నీ లియోన్.. ‘మందిర’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Hamsa |
Sunny Leone: భయపెట్టేందుకు వచ్చేస్తున్న సన్నీ లియోన్.. ‘మందిర’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్‌(Sunny Leone)కు వరల్డ్ వైడ్‌గా ఎంతలా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు తెలుగు చిత్రాల్లో నటించిన సన్నీ ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీ నటిగా మారిపోయింది. ప్రజెంట్ సన్నీ లియోన్(Sunny Leone) కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఉన్న సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈ అమ్మడు ‘మందిర’(Mandira) చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మందుకు రాబోతుంది. అయితే ఈ మూవీని ఆర్ యువన్(R.YUVAN) దర్శకత్వం వహిస్తున్నారు. ఒక కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్(Vision Movie Makers) బ్యానర్‌పై కొమ్మలపాటి సాయి సుధాకర్(Sai Sudhakar) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ పాటలు విడుదలై హైప్ క్రియేట్ చేశాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘మందిర’ మేకర్స్ రిలీజ్ తేదీ ప్రకటిస్తూ సన్నీ లియోన్(Sunny Leone) పోస్టర్‌ను షేర్ చేశారు. నవంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ స్టన్నింగ్ లుక్‌(Stunning look)తో సినీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ప్రజెంట్ సన్నీ పోస్టర్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా సూపర్, అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ‘మందిర’ విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed