Sunny Leone :పెళ్లిలో ప్రజెంట్ చేసిన గిఫ్ట్స్‌తో రిసెప్షన్ బిల్లులు చెల్లించిన Porn Star

by Malleboina Mahesh |   (  Updated:2022-04-10 09:22:32  IST  )

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్, నటి సన్నీలియోన్ తన పెళ్లికి సంబంధించిన స్వీట్ మెమొరీస్‌ను అభిమానులతో

Sunny Leone :పెళ్లిలో ప్రజెంట్ చేసిన గిఫ్ట్స్‌తో రిసెప్షన్ బిల్లులు చెల్లించిన Porn Star
X

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్, నటి సన్నీలియోన్ తన పెళ్లికి సంబంధించిన స్వీట్ మెమొరీస్‌ను అభిమానులతో పంచుకుంది. 2011లో అమెరికన్ యాక్టర్, ఇండస్ట్రియలిస్ట్ డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకున్న సన్నీ.. మ్యారేజ్ డే సందర్భంగా అప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు ఒక లాంగ్ నోట్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్.. 'ఇది 11 ఏళ్ల కిందటి నా మ్యారేజ్ పిక్. ఆ టైమ్‌లో చేతిలో సరిపడా డబ్బుల్లేక మా వివాహ వేడుకకు కేవలం 50 మందినే ఆహ్వానించాం. పెద్దగా అలంకరణలు కూడా లేకపోవడంతో పెళ్లికి వచ్చిన అతిథులు నానా మాటలన్నారు.

వారు ప్రజెంట్ చేసిన వెడ్డింగ్ ఎన్వలప్స్‌లోని డబ్బులతోనే రిసెప్షన్ బిల్లులు చెల్లించాం. ఆ రోజులు తలుచుకుంటే మేం చాలా దూరం ఎంతో ఆవేదనతో ప్రయాణించామని అర్థమవుతోంది. నా భర్త ప్రేమాభిమానాలు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. హాపీ యానివర్సరీ బేబీ' అంటూ తాము ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకుంది. ఇదిలా ఉంటే, టాలీవుడ్ హీరో మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తున్న సన్నీ.. అతనితో ఫన్నీ గేమ్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Sunny Leone reveals she had 'no money' for her wedding; Shares a THROWBACK pic on her anniversary

Next Story